పాటకు డ్యాన్స్ కంపోజ్ చేయనున్న సాయిపల్లవి!
- శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ'
- కొరియోగ్రఫీ చేయమని అడిగిన దర్శకుడు
- త్వరలో చైతు, సాయిపల్లవిపై చిత్రీకరణ
అందాలతార సాయిపల్లవి కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తనుంది. నిజమే.. ఓ సినిమా పాటకు ఆమె డ్యాన్సుల్ని కంపోజ్ చేయనుంది. ఈ ముచ్చట నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రం విషయంలో చోటు చేసుకుంటోంది.
మామూలుగా పాటలకు కొరియోగ్రాఫర్లు డ్యాన్సుల్ని కంపోజ్ చేస్తుంటారు. అయితే, కాస్త వెరైటీ కోసం దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రంలోని ఓ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేయమని సాయిపల్లవిని రిక్వెస్ట్ చేశాడట. దాంతో ఆమె కూడా సంతోషంగా ఒప్పుకుందని సమాచారం. షూటింగులు మొదలయ్యాక రామోజీ ఫిలిం సిటీలో ఈ పాటను చైతన్య, సాయిపల్లవిపై చిత్రీకరిస్తారు. అన్నట్టు, సాయిపల్లవి మంచి డ్యాన్సర్ అన్న విషయం చాలామందికి తెలిసిందే.