రాజస్థాన్ రాజకీయాల్లో మరో మలుపు.. ఫోన్ల ట్యాంపింగు ఆరోపణలపై స్పందించిన కేంద్రం
- రాజస్థాన్‌లో కలకలం రేపుతున్న ఆడియో టేపుల వ్యవహారం
- ఇప్పటికే రంగంలోకి దిగిన ఏసీబీ
- వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ సీఎస్‌కు కేంద్రం ఆదేశం
రాజస్థాన్ రాజకీయాల్లో మరో కొత్త మలుపు చోటుచేసుకుంది. గెహ్లాట్ సర్కారును కూల్చివేసేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేలా మాట్లాడినట్టు చెబుతున్న ఆడియో టేపుల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతుండగా, తాజాగా ఈ విషయంపై కేంద్రం స్పందించింది. టేపుల వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ ప్రధాన కార్యదర్శిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఈ వ్యవహారంపై ఏసీబీ ఇప్పటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించగా, ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, రాజ్యంగ విరుద్ధమైన పద్ధతుల్లో రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిందని బీజేపీ ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించినట్టు బీజేపీ అంగీకరిస్తోందని కాంగ్రెస్ చెబుతోంది.