ఢిల్లీలో కుంభవృష్టి... కొట్టుకుపోతున్న ఇళ్లు!
- ఢిల్లీలో భారీ వర్షాలు
- చెరువులను తలపిస్తున్న రోడ్లు
- నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ఇన్నాళ్లు వర్షాభావం ఎదుర్కొన్న దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. హస్తినలో ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఐటీఓ రింగ్ రోడ్డు సమీపంలోని అన్నా నగర్ మురికివాడల్లో కాలువల పక్కనే ఉన్న ఇళ్లు భారీ వర్షాలకు కుప్పకూలి కొట్టుకుపోతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. నగరంలోని ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వార్షలు కురుస్తాయన్న నేపథ్యంలో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.