విశాఖ క్రేన్ ప్రమాదానికి కారకులు ఎంతవారైనా వదిలిపెట్టకూడదు: విజయసాయిరెడ్డి
- నిన్న విశాఖలో క్రేన్ ప్రమాదం
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయసాయి
- శాఖాపరమైన విచారణ షురూ అయిందని వెల్లడి
విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డులో ఓ భారీ క్రేన్ కుప్పకూలి 11 మంది దుర్మరణం పాలవడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ ఘోర దుర్ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి పట్ల తన హృదయం చలించిపోయిందని, వారు ఈ విషాదం నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు విజయసాయి ట్వీట్ చేశారు. ఈ ఘటనలో శాఖాపరమైన విచారణ షురూ అవుతుందని వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారకులు ఎంతవారైనా వదిలిపెట్టరాదని పేర్కొన్నారు.