యూపీఎస్సీ ఫలితాల్లో '420'వ ర్యాంకు సాధించిన 'రాహుల్ మోదీ'పై ట్రోలింగ్‌

  • అభ్యర్థి పేరు రాహుల్‌ మోదీ కావడంతో ట్రోల్
  • #RahulModi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్
  • మీమ్స్ సృష్టిస్తోన్న నెటిజన్లు
యూపీఎస్సీ  తాజాగా ప్రకటించిన ఫలితాల్లో '420'వ ర్యాంకు సాధించిన ఒక అభ్యర్థి తన పేరు కారణంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ అవుతున్నాడు. ఆయన‌ పేరు రాహుల్‌ మోదీ కావడమే ఇందుకు కారణం. ఆయన పేరులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పదాలు ఉన్నాయి.

రాజకీయాల్లో మోదీ, రాహుల్ విమర్శలు గుప్పించుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఆ రెండు పార్టీల నాయకుల పేరు కలిసే ఉండటంతో  ఆ యూపీఎస్సీ అభ్యర్థిపై నెటిజన్ల దృష్టి పడింది.   #RahulModi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మోదీ, రాహుల్ ఫొటోలను జత చేస్తూ మోదీతో పాటు రాహుల్ యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంపై మీమ్స్ సృష్టిస్తున్నారు.


More Telugu News