పొగతాగే అలవాటున్న వారిని చుట్టుముడుతోన్న రోగాలు.. పరిశోధనలో వెల్లడి

  • సౌత్‌ ఆస్ట్రేలియా వర్సిటీ పరిశోధకుల వెల్లడి
  • 1,52,483 మంది రోగుల సమాచారం విశ్లేషణ
  • పొగతాగేవారికి 28 రకాల రోగాలు వచ్చే అవకాశం
  • కేన్సర్‌, శ్వాస, హృద్రోగాలు, కిడ్నీల సమస్యలు
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసినప్పటికీ చాలా మంది దానికి దూరంగా ఉండకుండా తమకేం కాదులే అన్నట్లు పొగతాగేస్తుంటారు. చివరకు రోగాల బారిన చిక్కుకుని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతారు.. మృత్యువాత పడతారు. పొగతాగితే వచ్చే ఆరోగ్య సమస్యలపై  సౌత్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్నే తేల్చారు.

పరిశోధనలో భాగంగా 1,52,483 మంది రోగుల సమాచారాన్ని విశ్లేషించి ఫలితాలను ప్రకటించారు. పొగతాగేవారికి 28 రకాల రోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలాగే, పొగ తాగని వారితో పోల్చి చూస్తే 30 శాతం అధికంగా రోగాల బారిన పడే ప్రమాదం ఉందని తేల్చారు. 10 సంవత్సరాల ముందే మృతి చెందే ఛాన్స్ ఉందని చెప్పారు. ప్రతిరోజు సిగరెట్‌ తాగితే కేన్సర్‌, శ్వాస, హృద్రోగాలు, కిడ్నీలు, న్యుమోనియా, కంటి, రక్త సంబంధిత వ్యాధుల బారినపడతారని తెలిపారు.


More Telugu News