ఇక మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదు.. చైనా ప్రకటన

  • మాస్కులు ధరించాలన్న నిబంధనను ఎత్తేసిన చైనా
  • బీజింగ్ లో నమోదు కాని కొత్త కేసులు
  • వూహాన్ లో జలకాలాటలతో ఎంజాయ్ చేస్తున్న  జనాలు
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్నంతా అతలాకుతలం చేసింది. ధనిక దేశం, పేద దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాలు దీని దెబ్బకు కకావికలం అయ్యాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అన్ని దేశాలు ఉంటే... చైనా మాత్రం ప్రశాంతంగా ఉంది.

కరోనా పుట్టిన వూహాన్ నగరంలో జనాలు వీకెండ్ పార్టీలో జలకాలాటల్లో మునిగితేలడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు చైనా అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో జనాలు మాస్కులు ధరించాలన్న నిబంధనను చైనా ఎత్తేసింది. మాస్కులు ధరించకుండా కూడా ప్రజలు బయటకు వెళ్లొచ్చని అధికారులు తెలిపారు. బీజింగ్ లో గత 13 రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


More Telugu News