జాతిపిత కళ్లజోడుకు కళ్లు చెదిరే ధర!
- 1920లో ఓ దక్షిణాఫ్రికా వ్యక్తికి తన కళ్లజోడు ఇచ్చిన గాంధీజీ
- ఆ వ్యక్తి నుంచి తర్వాతి తరాలకు సంక్రమించిన కళ్లజోడు
- వేలంలో రూ.2.5 కోట్లకు అమ్ముడైన వైనం
కేవలం అహింసాయుధంతో బ్రిటీషర్లను ఎదుర్కొన్న భారత జాతిపిత మహాత్మాగాంధీకి చెందిన ఓ కళ్లజోడుకు వేలంలో అదిరిపోయే ధర లభించింది. ఈ అపురూపమైన గోల్డ్ ప్లేటెడ్ కళ్లద్దాలను ఇంగ్లాండ్ కు చెందిన ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్ సంస్థ వేలం వేయగా రూ.2.5 కోట్ల ధరకు అమ్ముడయ్యాయి. అమెరికాకు చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి గాంధీ కళ్లజోడును దక్కించుకున్నాడు.
మహాత్ముడు 1920లో దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో బ్రిటీష్ పెట్రోలియం సంస్థలో పనిచేసే ఓ వ్యక్తికి ఆ కళ్లజోడును ఇచ్చారు. ఆ వ్యక్తి నుంచి అతని తర్వాతి తరం వ్యక్తులకు అవి సంక్రమించాయి. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి ఆ కళ్లజోడుతో పెద్దగా ఉపయోగం లేదని, పారేయాలని భావించి, ఆ తర్వాత మనసు మార్చుకుని బ్రిటన్ లోని వేలం సంస్థకు పంపాడు. ఇప్పుడా కళ్లజోడే అతడిని కోటీశ్వరుడ్ని చేసింది.