ప్రకాశం జిల్లా వేటపాలెం ఎస్సై అజయ్ బాబుపై సస్పెన్షన్ వేటు
- వేటపాలెంలో దొంతు వెంకటేశ్వరరెడ్డి హత్య
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన ఎస్సై
- విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ ఆరోపణలు
విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని పోలీసు సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవలే ప్రకాశం జిల్లాలో ఒంగోలు తాలూకా స్టేషన్ సీఐ లక్ష్మణ్ ను సివిల్ పంచాయితీల నేపథ్యంలో ఐజీ ప్రభాకర్ రావు సస్పెండ్ చేశారు. జిల్లాలో ఇప్పుడు మరో పోలీసు అధికారిపై వేటు వేశారు. వేటపాలెం ఎస్సై అజయ్ బాబును సస్పెండ్ చేస్తూ ఐజీ ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల వేటపాలెంలో దొంతు వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అయితే, ఎస్సై అజయ్ బాబు ఆ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాడు. తద్వారా ఆయన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ విచారణకు ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా గుంటూరు రేంజి ఐజీ ప్రభాకర్ రావు సదరు ఎస్సైని సస్పెండ్ చేశారు.