ఆరు దశాబ్దాల క్రితం అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించిన రష్యా... ఇన్నాళ్లకు ఫుటేజి విడుదల!
- 1961లో పరీక్షించిన సోవియట్ యూనియన్
- హిరోషిమాపై వేసిన బాంబు కంటే 3,333 రెట్లు శక్తిమంతమైన బాంబు
- రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో ప్రకంపనలు
యావత్ ప్రపంచం కరోనా వైరస్ తో పోరాటం సాగిస్తున్న వేళ రష్యా అణు పాటవానికి సంబంధించిన వీడియో విడుదలైంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును రష్యా 60వ శతకంలోనే పరీక్షించి చూసిందన్న నిజం ఈ వీడియో ద్వారా అందరికీ తెలిసింది. రష్యా అణు కార్యక్రమం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వీడియో ఫుటేజి రిలీజ్ చేశారు. ఈ అణుబాంబు పేరు త్సార్ బాంబా. ఈ బాంబు శక్తి ఎంత అంటే హిరోషిమాపై నాడు అమెరికా ప్రయోగించిన అణుబాంబు కంటే 3,333 రెట్లు అధికం.
1961 అక్టోబరు 30 బేరెంట్ సముద్రంలో దీన్ని పరీక్షించారు. ప్రచ్ఛన్నయుద్ధం జోరుగా సాగుతున్న రోజుల్లో నాటి సోవియట్ యూనియన్, అమెరికా మధ్య విపరీతమైన ఆయుధ పోటీ మాత్రమే కాదు, ఎవరు పెద్ద బాంబు తయారుచేస్తారన్న అంశంలోనూ పోటీ ఉండేది. ఆ పోటీ ఫలితమే త్సార్ బాంబా. ఉదాహరణకు ఈ బాంబును ఢిల్లీపై వేస్తే దాని ప్రభావం పాకిస్థాన్ వరకు ఉంటుంది. నాడు ఈ బాంబును పరీక్షించిన సమయంలో రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో భూమి ప్రకంపించిందంటే దీని పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.