విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా!
- ప్రణబ్ ముఖర్జీ మరణం నేపథ్యంలో సంతాప దినాలు
- ఏడు రోజుల పాటు వాయిదా పడిన కార్యక్రమం
- 7న లేదా 8న ప్రారంభోత్సవం జరిగే అవకాశం
విజయవాడలోని ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు నిర్మించిన దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం నేపథ్యంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో, వారం రోజుల తర్వాత ఫ్లైఓవర్ ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 7న లేదా, 8న ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది. ఇటీవలే ఫ్లైఓవర్ కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా... అది వైరల్ అయింది.