అమెజాన్ ప్రైమ్ లో అనుష్క సినిమా!
- థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ వేదికలు
- అనుష్క ప్రధాన పాత్రధారిగా 'నిశ్శబ్దం'
- ఏప్రిల్ లోనే విడుదల కావలసిన సినిమా
- తాజాగా అమెజాన్ ప్రైమ్ కు స్ట్రీమింగ్ హక్కులు
థియేటర్ల కోసం ఎదురుచూసి, చూసీ కొందరు నిర్మాతలు ఇక తమ సినిమాలను ఓటీటీ ప్లేయర్స్ కి ఇచ్చేస్తున్నారు. మరికొందరేమో తాము కూడా అలా ఇచ్చేసి, నష్టాలను కాస్త తగ్గించుకుని బయటపడదామని అనుకుంటున్నప్పటికీ, ఆయా హీరోల అభ్యంతరాల కారణంగా ఓటీటీ ద్వారా విడుదల చేయలేకపోతున్నారు. ఈ క్రమంలో అనుష్క నటించిన 'నిశ్శబ్దం' చిత్రం కూడా చివరికి ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయింది.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించారు. వాస్తవానికి ఏప్రిల్ నెలలోనే విడుదల కావలసిన చిత్రం ఇది. అయితే, లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడడంతో విడుదల ఆగిపోయింది. అప్పటి నుంచీ నిర్మాత ఓటీటీ ద్వారా రిలీజ్ చేద్దామని ప్రయత్నించినప్పటికీ, అనుష్క అభ్యంతరం చెప్పడం వల్ల, మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ విడుదల చేయడం వీలుపడలేదని ప్రచారం జరిగింది.
అయితే, ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవడం అయ్యేపనికాదన్న విషయం తేలిపోవడంతో, ఇన్నాళ్లూ ఆగిన నిర్మాత ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కి చిత్రాన్ని స్ట్రీమింగ్ కోసం ఇచ్చేసినట్టు సమాచారం. ఈ నెల 5న నాని నటించిన 'వి' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు 'నిశ్శబ్దం' స్ట్రీమింగ్ ఉంటుందని తెలుస్తోంది.