క్వారంటైన్లో వున్నప్పుడు ఏదో ఒక వ్యాపకంతో బిజీగా గడిపాను: జెనీలియా

  • కరోనా నుంచి కోలుకున్న జెనీలియా
  • క్వారంటైన్ కోసం మరో ఇంట్లో గడిపినట్టు వెల్లడి
  • ఎంతో ఆందోళనకు గురయ్యానన్న నటి
మాజీ హీరోయిన్ జెనీలియా డిసౌజా ఇటీవల కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న ఆమె తన కరోనా అనుభవాలను ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తమ ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా సోకడంతో తాను కూడా కరోనా పరీక్ష చేయించుకున్నానని, ఆ టెస్టులో పాజిటివ్ వచ్చిందని జెనీలియా వెల్లడించింది.

ఆ టెస్టు చేయించుకోకుండా ఉంటే తనకు కరోనా సోకిన విషయం ఎప్పటికీ తెలిసేది కాదేమో అని తెలిపింది. ఎందుకంటే తనకు ఒక్క కరోనా లక్షణం కూడా లేదని పేర్కొంది. పాజిటివ్ వచ్చిన వెంటనే క్వారంటైన్ కోసం మరో ఇంటికి మారానని, ఆ సమయంలో పిల్లలను తన భర్త రితేశ్ దేశ్ ముఖ్ ఎంతో బాగా చూసుకున్నాడని వివరించింది.

వేరే ఇంట్లో ఉన్న సమయంలో నిత్యం ఏదో ఒక వ్యాపకం కల్పించుకుంటూ బిజీగా గడిపినట్టు జెనీలియా వెల్లడించింది. కుటుంబానికి దూరంగా ఉండడం ఎంతో కష్టమన్న విషయం ఆ సమయంలో అర్థమైందని, కరోనా నుంచి బయటపడకపోతే పరిస్థితి ఏంటని ఎంతో ఆందోళనకు గురైనట్టు తెలిపింది.


More Telugu News