రిలయన్స్ దూకుడుతో.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 646 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 171 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 7 శాతానికి పైగా ఎగబాకిన రిలయన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. తమ రిటైల్ విభాగంలో సిల్వర్ లేక్ సంస్థ రూ. 7,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు రిలయన్స్ ప్రకటించడంతో ఆ సంస్థ షేర్లు ఈరోజు దూసుకుపోయాయి. రిలయన్స్ అండతో మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 646 పాయింట్లు పెరిగి 38,840కి చేరుకుంది. నిఫ్టీ 171 పాయింట్లు పుంజుకుని 11,449 వద్ద స్థిరపడింది. టెలికాం, మెటల్ మినహా ఈరోజు అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (7.10%), ఏసియన్ పెయింట్స్ (4.25%), యాక్సిస్ బ్యాంక్ (3.70%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.79%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.51%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-2.24%), భారతి ఎయిర్ టెల్ (-1.38%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.54%), టైటాన్ కంపెనీ (-0.47%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.46%).