వ్యవసాయ బిల్లుల ప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- 811 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 254 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 8 శాతానికి పైగా పతనమైన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాలను చవిచూశాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో పాటు, వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో కూడా ఆమోదముద్ర పడటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. అమ్మకాలకు మొగ్గుచూపారు.
ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 811 పాయింట్లు కోల్పోయి 38,034కి పడిపోయింది. నిఫ్టీ 254 పాయింట్లు నష్టపోయి 11,250కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-8.57%), భారతి ఎయిల్ టెల్ (-5.95%), టాటా స్టీల్ (-5.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (-5.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (-5.19%).
సెన్సెక్స్ లో కేవలం టీసీఎస్ (0.63%), ఇన్ఫోసిస్ (0.36%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.33%) మాత్రమే లాభాల్లో ముగిశాయి.