లాక్ డౌన్ దిశగా యూరప్ అడుగులు.. వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!

  • 300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 96 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 3 శాతం వరకు నష్టపోయిన మారుతి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ ను నష్టాల్లో ముగించాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో యూరప్ లో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయనే వార్తలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో, వారంతా అమ్మకాలకు మొగ్గుచూపారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోయి 37,734కి పడిపోయింది. నిఫ్టీ 96 పాయింట్లు పతనమై 11,153 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.43%), టీసీఎస్ (2.20%), సన్ ఫార్మా (1.35%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.04%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.80%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.83%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.79%), యాక్సిస్ బ్యాంక్ (-2.59%, ఓఎన్జీసీ (-2.32%, రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.95%).


More Telugu News