ఐపీఎల్ తాజా సీజన్ చివరి దశలో మహిళల మ్యాచ్ లు!
- నవంబరు 4 నుంచి 9 వరకు మహిళల ఐపీఎల్!
- మూడు జట్లు... నాలుగు మ్యాచ్ లు
- త్వరలో వెల్లడించనున్న బీసీసీఐ
గత ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్ దశలో మహిళలతోనూ మ్యాచ్ లు నిర్వహించిన బీసీసీఐ ఈసారి కూడా అదే రీతిలో ప్రణాళిక రూపొందించింది. ఈ ఏడాది 4 మహిళల జట్లతో మ్యాచ్ లు నిర్వహించాలని భావించినా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో 3 జట్లతో పరిమిత సంఖ్యలో మ్యాచ్ లు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
నవంబరు 4 నుండి 9వ తేదీ మధ్యలో కేవలం నాలుగు మ్యాచ్ లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. పోటీలకు మరో నెల సమయం ఉండడంతో మరికొన్ని రోజుల్లోనే అమ్మాయిల జట్లు యూఏఈ వెళ్లి క్వారంటైన్ కాలాన్ని పూర్తిచేసుకోనున్నాయి. పురుషులకు వర్తించే కరోనా నియమావళే మహిళలకు కూడా వర్తింపజేయనున్నారు.