దుబ్బాక ఉప ఎన్నిక.. అభ్యర్థిని ఖరారు చేసిన కాంగ్రెస్!

  • నర్సారెడ్డి పేరును ఖరారు చేసిన టీపీసీసీ
  • హైకమాండ్ కు నర్సారెడ్డి పేరును పంపిన వైనం
  • నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్
దుబ్బాక ఉప ఎన్నికలో టీకాంగ్రెస్ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. సిద్ధిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరును ఖరారు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లా నేతల సూచన మేరకు టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. నర్సారెడ్డి పేరును పార్టీ హైకమాండ్ కు పంపించింది. అధిష్ఠానం ఆమోదం తెలిపిన వెంటనే నర్సారెడ్డి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి చెందడంతో దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. 10వ తేదీన కౌంటింగ్ జరగనుంది. మరోవైపు రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. బీజేపీ తరపున రఘునందన్ రావు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.


More Telugu News