అదుపుకోల్పోయి విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ నౌక.. వీడియో ఇదిగో

  • విశాఖ తెన్నేటి పార్క్ వద్ద ఒడ్డుకు భారీ నౌక 
  • బంగ్లాదేశ్‌కు చెందిన నౌక?
  • గాలుల తాకిడి అధికంగా ఉండడంతో ఘటన
విశాఖ తెన్నేటి పార్క్ వద్ద సముద్రపు ఒడ్డుకు ఓ భారీ నౌక కొట్టుకురావడంతో దాన్ని చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఆ భారీ నౌక బంగ్లాదేశ్‌కు చెందినదని సమాచారం.  గత రాత్రి గాలుల తాకిడి అధికంగా ఉండడంతో అది ఇలా అదుపుకోల్పోయి తీరానికి కొట్టుకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
             
అలల తాకిడికి ఔటర్ హార్బర్‌లో యాంకర్ తెగి ఒడ్డుకు వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది తీరానికి సమీపంలో ఇసుకలో కూరుకుపోయింది. అందులో దాదాపు 15మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు, పోర్టు సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    


More Telugu News