'రాధేశ్యామ్' సెట్స్ పై కేక్ కట్ చేసిన ప్రభాస్

  • బర్త్ డే బాయ్ ప్రభాస్ పై శుభాకాంక్షల జడివాన
  • విషెస్ తో నిండిపోయిన సోషల్ మీడియా
  • స్పెషల్ కేక్ ఏర్పాటు చేసిన రాధేశ్యామ్ చిత్రబృందం
టాలీవుడ్ లో ఎంతో సౌమ్యుడిగా పేరుపొందిన అగ్రహీరో ప్రభాస్ తన పుట్టినరోజును 'రాధేశ్యామ్' చిత్రం సెట్స్ పై జరుపుకున్నారు. చిత్ర యూనిట్ ప్రభాస్ కోసం స్పెషల్ కేక్ తెప్పించింది. దాంతో ఈసారి షూటింగ్ స్పాట్ లోనే ప్రభాస్ బర్త్ డే వేడుకలు జరిగాయి. ఇప్పటికే 'బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్' పేరిట కానుక రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తమ హీరో ప్రభాస్ కు గ్రాండ్ గా విషెస్ తెలిపింది. సోషల్ మీడియా నిండా ప్రభాస్ బర్త్  డే విషెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం 'రాధేశ్యామ్' షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఇటలీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ 'రాధేశ్యామ్ షూటింగ్ జరుపుతున్నారు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే కథానాయిక.


More Telugu News