ఇక బాలయ్య కూడా ఈ రోజు రంగంలోకి దిగారు!

  • బోయపాటితో బాలకృష్ణ మూడో చిత్రం 
  • లాక్ డౌన్ కి ముందు జరిగిన ఒక షెడ్యూల్
  • ఏడు నెలల తర్వాత షూటింగులో బాలయ్య 
  • కథానాయికగా ప్రయాగ మార్టిన్ ఎంపిక 
నందమూరి బాలకృష్ణ కూడా ఈ రోజు నుంచి షూటింగులోకి దిగారు. తనకు ఇప్పటికే రెండు హిట్లు ఇచ్చిన ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన మూడో చిత్రాన్ని చేస్తున్న సంగతి విదితమే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన ఒక షెడ్యూల్ షూటింగ్ జరిగింది. ఆ తర్వాత లాక్ డౌన్ పడడంతో గత ఏడు నెలల నుంచీ షూటింగుకి బ్రేక్ పడింది. ఈ క్రమంలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ రోజు నుంచి హైదరాబాదులో తదుపరి షెడ్యూలు షూటింగును నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ కూడా ఈ రోజు షూటింగులో జాయిన్ అయ్యారు.  

బోయపాటి మార్కు హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి మీనా కీలక పాత్ర పోషిస్తుండగా.. మలయాళ ముద్దుగుమ్మ ప్రయాగ మార్టిన్ ను కథానాయికగా ఎంపిక చేసినట్టు ఇటీవల వార్తలొచ్చాయి. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News