మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్... భారీ స్కోరు సాధించిన కోల్ కతా

  • దుబాయ్ లో రాజస్థాన్ వర్సెస్ కోల్ కతా
  • 35 బంతుల్లో 68 రన్స్ చేసిన మోర్గాన్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసిన కోల్ కతా
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అదరగొట్టాడు. కేవలం 35 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. మోర్గాన్ స్కోరులో 5 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. మోర్గాన్ విజృంభణతో కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 36, రాహుల్ త్రిపాఠి 39 పరుగులు చేశారు. ప్రమాదకర ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 25 పరుగులు సాధించాడు. నితీశ్ రాణా, సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్ డకౌట్ అయ్యారు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో రాహుల్ తెవాటియా 3, కార్తిక్ త్యాగి 2, ఆర్చర్ 1, శ్రేయాస్ గోపాల్ 1 వికెట్ తీశారు.


More Telugu News