ఇలియానా చేతికి స్వల్ప గాయం.. ఫొటో పోస్ట్ చేసిన హీరోయిన్.. కంగారు పడ్డ అభిమానులు

  • ‘అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్‌లీ’ సినిమాలో న‌టిస్తోన్న ఇలియానా
  • కుడి అరచేతిపై స్వల్పంగా రక్తం
  • కంగారు పడ్డ అభిమానులు  
హీరోయిన్ ఇలియానా ప్ర‌స్తుతం బ‌ల్వీంద‌ర్ సింగ్ జ‌నుజ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ్‌దీప్ హుడాతో కలిసి ‘అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్‌లీ’ సినిమాలో న‌టిస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఇలియానా స్వల్పంగా గాయ‌ప‌డింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన చేతి ఫొటోను షేర్ చేసింది. ఆమె కుడి అరచేతిపై స్వల్పంగా రక్తం కనపడింది. దీంతో అభిమానులు కంగారు పడ్డారు. ఏం జరిగిందని కామెంట్లు చేశారు.

అయితే, దీనిపై ఇలియానా మాత్రం ఫన్నీగా కామెంట్ చేయడం గమనార్హం. రొమాంటిక్ కామెడీ సినిమా కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవరు గాయపడతారు? అని ఆమె పేర్కొంది. కాగా, కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల షూటింగులు బంద్ అవడంతో కొన్ని నెలల పాటు ఇంట్లోనే ఉన్న హీరోయిన్లు ప్రస్తుతం షూటింగుల్లో మళ్లీ పాల్గొంటూ బిజీ లైఫ్‌లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తన షూటింగ్ కు సంబంధించిన విషయాలను తెలుపుతున్నారు.


More Telugu News