డబ్బుల కోసం గోవా ముఖ్యమంత్రిని బెదిరించిన యువకుడి అరెస్ట్
- ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులకు అసభ్యకర, బెదిరింపు మెసేజ్‌లు
- మెసేజ్‌లలో వ్యక్తిగతంగా తనకు శత్రువైన వ్యక్తి ఫోన్ నంబరు
- ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు
డబ్బుల కోసం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ను బెదిరిస్తున్న యువకుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దక్షిణ గోవాలోని సాంకోలే గ్రామానికి చెందిన ఆశిష్ నాయక్(25) డబ్బులు డిమాండ్ చేస్తూ సీఎం ప్రమోద్ సావంత్‌కు మెసేజ్‌లు పంపించాడు. వెంటనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాక, ఆయనను దూషిస్తూ అసభ్యకరమైన సందేశాలు పంపించాడు. దీంతో ప్రమోద్ సావంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారం రోజుల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు.
ముఖ్యమంత్రితోపాటు మరెందరికో ఇలాంటి బెదిరింపు మెసేజ్‌లే అతడు పంపించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఓ అంతర్జాతీయ నంబరు ద్వారా మెసేజ్‌లు పంపిస్తూ, వ్యక్తిగతంగా తనకు శత్రువు అయిన ఓ వ్యక్తి నంబరును అందులో ప్రస్తావించేవాడని పోలీసులు వివరించారు. నవంబరు 5న సీఎం ప్రమోద్ సావంత్ ఫిర్యాదు చేయగా, రెండు రోజుల తర్వాత గోవా ఫార్వార్డ్ పార్టీ ఉపాధ్యక్షుడు దుర్గాదాస్ కామత్ కూడా తనకు ఇలాంటి బెదిరింపు మేసేజ్‌లు వచ్చినట్టు పోండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ మాజీ నేత ప్రణవ్ సన్వోర్దేకర్ చర్చోరమ్ కూడా పోలీసులకు ఇలాంటి ఫిర్యాదే చేయడం గమనార్హం.