చైనా టీకాను తీసుకున్న కిమ్ జాంగ్ ఉన్... కుటుంబసభ్యులు, అధికారులకు కూడా!
- కరోనా చుట్టుముట్టగానే సరిహద్దులను మూసివేసిన కిమ్
- చైనా వ్యాక్సిన్ ను తీసుకున్నారన్న యూఎస్ సంస్థ
- ఇంతవరకూ ఒక్క కేసు కూడా రాలేదంటున్న నార్త్ కొరియా
కరోనా ప్రపంచాన్ని చుట్టుముట్టగానే, తన దేశపు సరిహద్దులను దిగ్బంధించి, బయటి నుంచి ఒక్కరిని కూడా రానీయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న కిమ్ జాంగ్ ఉన్, చైనాలో తయారైన ఓ టీకాను తీసుకున్నారట. ఈ విషయాన్ని వాషింగ్టన్ కేంద్రంగా నడుస్తున్న సెంటర్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ సంస్థ ప్రతినిధి హారీ కజియానిస్ వెల్లడించారు. ఉత్తర కొరియా వ్యవహారాలను అనునిత్యమూ పరిశీలిస్తుండే ఆయన, కిమ్ కుటుంబీకులు, ముఖ్యమైన అధికారులు కూడా వ్యాక్సిన్ ను వేయించుకున్నారని చెప్పడం గమనార్హం.
కాగా, చైనాలో పలు రకాల టీకాలు అభివృద్ధి దశలో ఉండగా, కిమ్ ఏది వాడారన్న విషయాన్ని మాత్రం ఆయన పేర్కొనలేదు. ఇంతవరకూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహా, ఇతర నియంత్రణా సంస్థలేవీ ఏ టీకానూ ఆమోదించ లేదన్న సంగతి తెలిసిందే.
ఇక చైనా ప్రజలతో నేరుగా వ్యాపారాలు నిర్వహించే ఉత్తర కొరియాలో ఒక్క కేసు కూడా ఇంతవరకూ రాకపోవడాన్ని యూఎస్ నిఘా సంస్థలు తోసిపుచ్చుతున్నాయి. అయితే, కరోనా వచ్చిన కొత్తల్లో హోమ్ క్వారంటైన్ లో ఉండాలని చెబితే వినలేదన్న కారణంతో ఓ వ్యక్తిని కాల్చి చంపినట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత కొరియా హ్యాకింగ్ ముఠాలు టీకాపై ఇన్ఫర్మేషన్ కోసం సైబర్ దాడులకు దిగాయని మైక్రోసాఫ్ట్ ఆరోపించింది కూడా. హ్యాకర్ల బారిన ఆస్ట్రాజెనికా కూడా పడిందని కొన్ని కథనాలు వచ్చాయి.