అందరూ తప్పులు చేస్తారు.. నేనూ అంతే!: సచిన్ టెండూల్కర్
- మనమంతా మనుషులమే
- తప్పులు చేసి, వాటి నుంచి నేర్చుకుంటేనే పైకి వస్తాం
- ఇదే అలవాటు నా క్రికెట్ కెరీర్ ను అద్భుతంగా తీర్చిదిద్దింది
- నేర్చుకోడానికి సిద్ధపడితే మరింత జ్ఞానాన్ని సంపాదిస్తామన్న సచిన్
మనమంతా మనుషులమేనని, ఎవరైనా సరే తప్పులు చేస్తారని టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ అన్నారు. యూట్యూబ్ ఛానల్‌లో నిర్వహించిన ఆస్క్ సచిన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. క్రికెట్లో తాను చేసిన తప్పుల గురించి చెప్పాలని సచిన్‌ను నెటిజన్లు కోరారు. దీనిపై ఆయన స్పందించారు.
తప్పులు చేసి, వాటి నుంచి నేర్చుకుంటేనే పైకి వస్తారని ఆయన చెప్పుకొచ్చారు. తాను మైదానంలో ఎప్పుడైనా తప్పులు చేస్తే అనంతరం వాటి మీద దృష్టిసారించేవాడినని, ఆ తప్పుల్ని సరిచేసుకోవడం కోసం నెట్ లో ప్రాక్టీసు చేసే వాడినని చెప్పారు. ఇదే అలవాటు తన క్రికెట్ కెరీర్ ను అద్భుతంగా తీర్చిదిద్దిందని అన్నారు. మనం నేర్చుకోవడానికి సిద్ధపడితే మరింత జ్ఞానాన్ని సంపాదిస్తామని తెలిపారు. తనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని అన్నారు.
ఈ క్రమంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా విషయ పరిజ్ఞానం ఉన్నవారందరినీ అడిగి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటానని చెప్పారు. తాను 16 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికైనప్పటి నుంచి చివరి రోజు వరకూ ఇతరులతో మాట్లాడటానికే ప్రయత్నించి, సమాచారం ఇచ్చిపుచ్చుకున్నానని తెలిపారు. అదే తనను మరింత ఉత్తమ ఆటగాడిగా చేసిందని చెప్పారు.