ట్విట్టర్లో మరో రికార్డు సొంతం చేసుకున్న మహేశ్ బాబు
- దక్షిణాది హీరోలలో మహేశ్ రికార్డు
- ట్విట్టర్లో 11 మిలియన్ల ఫాలోవర్స్
- ఫేస్ బుక్ లో 5.8 మిలియన్లు
- ఇన్ స్టాలో 6.1 మిలియన్ల ఫాలోవర్లు
మన సినిమా హీరోలకు వుండే క్రేజ్ .. ఫాలోయింగ్ ఎలాంటిదో మనకు తెలుసు. ఇంకా తెలుసుకోవాలంటే ఆయా హీరోల సోషల్ మీడియా అకౌంట్స్ చూడాలి. వాళ్లకున్న క్రేజ్ ను బట్టి ఇక్కడ ఫాలోవర్స్ చేరుతుంటారు. ఆ విధంగా చూస్తే, టాలీవుడ్ లో మహేశ్ బాబు ముందువరసలో కనిపిస్తూవుంటాడు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో బిజీగా ఉంటూ, మహేశ్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు.
ఈ క్రమంలో ట్విట్టర్ అకౌంటులో మహేశ్ బాబు తాజాగా రికార్డు సొంతం చేసుకున్నాడు. 11 మిలియన్ల ఫాలోవర్స్ తో ఇప్పుడు సౌత్ హీరోలలో మహేశ్ ట్విట్టర్లో రికార్డు కొట్టాడు. దీంతో అభిమానులు సందడి చేస్తూ.. #11millionmaheshians హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరోపక్క, ఫేస్ బుక్ లో 5.8 మిలియన్లు, ఇన్ స్టాలో 6.1 మిలియన్ల ఫాలోవర్లతో మహేశ్ దూసుకుపోతున్నాడు.