పాత వాహనాలకు వైసీపీ రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసం చేస్తున్నారు: నారా లోకేశ్

  • దిశ పోలీసులకు ద్విచక్రవాహనాలు
  • వీడియో పంచుకున్న లోకేశ్
  • పోలీసు వాహనాలకు పార్టీ రంగులేంటని విస్మయం
  • రంగులతో రక్షణ రాదని స్పష్టీకరణ
  • మృగాళ్లను శిక్షిస్తేనే మహిళలకు ధైర్యం వస్తుందని వివరణ
పోలీసు వాహనాలకు వైసీపీ రంగులా? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పైగా పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసం చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది పోలీసుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలోనే యూనిఫాం కూడా వైసీపీ రంగులోకి మార్చేసేలా ఉన్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. అయినా, రంగులతో మహిళలకు రక్షణ రాదని, మూడు రంగుల మదంతో రోడ్ల మీద పడి మహిళలను వేధిస్తున్న మృగాళ్లను శిక్షిస్తేనే మహిళలు ధైర్యంగా బయటకు రాగలుగుతారని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

అంతేకాదు, ఈ సందర్భంగా లోకేశ్ పోలీసులకు చురకలంటించారు. అవి వైసీపీ రంగులు కాదు శాంతికి చిహ్నాలు అంటూ ఫ్యాక్ట్ చెక్ పేరుతో సమయం వృథా చేయకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టిపెడితే మంచిదని హితవు పలికారు. ఈ సందర్భంగా దిశ పోలీసులకు పంపిణీ చేస్తున్న ద్విచక్రవాహనాల వీడియోను కూడా పంచుకున్నారు.


More Telugu News