కన్న బిడ్డను హత్య చేసేందుకు రూ. 50 వేలు సుపారీ ఇచ్చిన తల్లి!
- ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో ఘటన
- అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న కుమార్తె
- మాట వినడం లేదని హత్య చేయించిన తల్లి
తప్పుడు మార్గంలో నడుస్తున్న తన కన్నబిడ్డను హత్య చేయించిందో తల్లి. ఒడిశాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, బాలాసోర్ సమీపంలో సుకురి గిరి (58) అనే మహిళకు షిబానీ నాయక్ (36) అనే కూతురు ఉంది. ఆమె అక్రమంగా సారా వ్యాపారం చేస్తోంది. ఆ వ్యాపారాన్ని వదిలేయాలని తల్లి ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. ఈ క్రమంలో ప్రమోద్ జెనా అనే వ్యక్తితో పాటు, మరో ఇద్దరిని సంప్రదించిన సుకురి, కుమార్తెను చంపేయాలని, అందుకు రూ. 50 వేలు ఇస్తానని డీల్ కుదుర్చుకుంది.
ఈ క్రమంలో నిందితులు ఆమె కుమార్తెను హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, లోతైన విచారణ జరిపించగా, షిబానీని చంపించింది తల్లేనని తేలింది. ఈ కేసులో సుకురితో పాటు మిగతా నిందితులను అరెస్ట్ చేశామని పోలీసు అధికారి పర్వేష్ పాల్ వెల్లడించారు. రూ. 50 వేలకు డీల్ కుదుర్చుకున్న ప్రధాన నిందితురాలు, కాంట్రాక్టు కిల్లర్ లకు రూ. 8 వేలు అడ్వాన్స్ ఇచ్చిందని తెలిపారు.