నాతో పెట్టుకోవద్దు... ఉన్న కొద్దిరోజులైనా జాగ్రత్తగా ఉండు!: నెల్లూరు జిల్లా ఎస్పీకి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్!
- డీసీఎంఎస్ చైర్మన్ పై సోషల్ మీడియాలో పోస్టులు
- చర్యలు ఎందుకు తీసుకోలేదన్న నల్లపురెడ్డి
- టీడీపీ నేత ఫోన్ చేస్తే కేసులు వద్దంటావా? అంటూ ఎస్పీపై వ్యాఖ్యలు
- జిల్లాలో ఎన్ని రోజులుంటావంటూ ఆగ్రహం
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్పీ పేరు ఎత్తకుండానే జిల్లా అధికారి అంటూ సంబోధిస్తూ నిప్పులు చెరిగారు. డీసీఎంఎస్ చైర్మన్ చలపతిరావుపై పోస్టులు పెడితే, వారిపై చర్యలు తీసుకోవద్దని నీ కింది అధికారులకు ఫోన్ చేస్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు... ఇవాళ ఉంటావు, రేపు మరో జిల్లాకు పోతావు... నాతో పెట్టుకోవద్దు... ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉండు! అంటూ హెచ్చరించారు. టీడీపీ నేతల మాట వింటూ ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టవద్దని చెప్పడానికి నువ్వెవరు? అంటూ మండిపడ్డారు. నువ్వు టీడీపీ ఏజెంటువా లేక జిల్లా అధికారివా? అంటూ నిలదీశారు.
"వాడికి ఒళ్లు బలిసి మా నేతపై పోస్టులు పెట్టాడు. మరి చర్యలు తీసుకోవాలా, లేదా? ఎవరో టీడీపీ మాజీ మంత్రి ఫోన్ చేస్తే కేసులు రిజిస్టర్ చేయవద్దని నువ్వేందయ్యా చెప్పేది? ఎన్ని రోజులు ఉంటావు నెల్లూరు జిల్లాలో? రెండు రోజులు లేక మూడ్రోజులు ఉంటావు. తర్వాత నీ బ్రతుకేంది?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.