కేరళలో యూడీఎఫ్ కూటమి బాధ్యతలు ఉమెన్ చాందీకి!
- కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు
- యూడీఎఫ్ కూటమి చైర్మన్‌గా ఊమెన్ చాందీ
- కూటమి విజయం తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామన్న ఏకే ఆంటోనీ
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి అప్పగిస్తూ సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూడీఎఫ్ కూటమికి చాందీ నేతృత్వం వహిస్తారు.
మొత్తం పదిమంది సభ్యులతో కూడిన ఈ కూటమికి చాందీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మిగతా వారిలో కేరళ పీసీసీ చీఫ్ ఎం. రామచంద్రన్, ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితాల, ఏఐసీసీ సంస్థాగత కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కేరళ ఇన్‌చార్జి ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్ అన్వర్ తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించనున్నట్టు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీ తెలిపారు.