బైడెన్ ప్రసంగాన్ని రాసిన తెలుగు బిడ్డ వినయ్ రెడ్డి!

  • ‘అమెరికా యునైటెడ్’ థీమ్‌తో ప్రసంగాన్ని రాసిన వినయ్
  • ఎన్నికల ప్రచారంలో బైడెన్ పేర్కొన్న అంశాల మేళవింపు
  • బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్య రచయితగా పనిచేసిన వినయ్
అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన ప్రసంగాన్ని రాసినదెవరో తెలుసా? మన తెలుగు వ్యక్తి వినయ్ రెడ్డి. ఫలితంగా అధ్యక్షుడి ప్రసంగం రాసిన తొలి భారతీయ అమెరికన్‌గా వినయ్ చరిత్ర సృష్టించారు. ‘అమెరికా యునైటెడ్’ థీమ్‌తో ఆయనీ ప్రసంగాన్ని రాశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జో పేర్కొన్న పలు అంశాలను ఇందులో మేళవించారు. 2013-17 మధ్య బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్య ప్రసంగ రచయితగా వినయ్ పనిచేశారు. ఒహియోలోని డేటన్‌లో వినయ్ నివసిస్తున్నారు.

ఇక, నూతన అధ్యక్షుడు బైడెన్ బృందంలో ఏకంగా 20 మందికిపైగా భారత సంతతి వ్యక్తులు ఉండడం గమనార్హం. వీరిలో 13 మంది మహిళలే కావడం మరో విశేషం. ఈ బృందంలోని 17 మంది వైట్‌హౌస్ కాంప్లెక్స్‌లో విధులు నిర్వర్తించనున్నారు. అమెరికాలో భారతీయ అమెరికన్ సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కశాతం మాత్రమే. అయినప్పటికే గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పదవులు దక్కడం విశేషం.


More Telugu News