2019 ఓటర్ల జాబితా ప్రకారం స్థానిక ఎన్నికలు వద్దంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టులో రేపు విచారణ

  • ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం ముమ్మర ఏర్పాట్లు
  • కోర్టును ఆశ్రయించిన న్యాయవాది శివప్రసాదరెడ్డి
  • ఎల్లుండి విచారణ జరుపుతామన్న హైకోర్టు
  • నోటిఫికేషన్ అదే రోజు వస్తుందన్న న్యాయవాది
  • రేపు విచారణ జరిపేందుకు హైకోర్టు నిర్ణయం
ఓవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ముమ్మరం చేసిన నేపథ్యంలో, ఎన్నికల నోటిఫికేషన్ ను అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరుకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల తరఫున న్యాయవాది శివప్రసాదరెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

 2019 నాటి ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరపడం సరికాదని, 2021 ఎన్నికల జాబితాతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. 2019 నాటి జాబితాతో 3.60 లక్షల మంది ఓటర్లకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.

ఈ పిటిషన్ పై న్యాయస్థానం శుక్రవారం విచారణ జరుపుతామని వెల్లడించింది. అయితే, ఎల్లుండి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని న్యాయవాది శివప్రసాదరెడ్డి కోర్టుకు తెలిపారు. దాంతో సానుకూలంగా స్పందించిన హైకోర్టు రేపు విచారించేందుకు అంగీకరించింది.


More Telugu News