రాష్ట్ర సమస్యలపై కాకుండా దేవాలయాలపై దాడుల గురించే మాట్లాడారు: వైసీపీపై కనకమేడల ఫైర్
- మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం
- ప్రతిపక్షాలపై బురద చల్లేందుకు యత్నించారన్న కనకమేడల
- జగన్ పాలనలోనే ఆలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్న
ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించి ఏవీ అడగలేదంటూ వైసీపీపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. ఏదీ అడగకుండానే అన్నీ అడిగినట్లు ప్రకటనలు ఇవ్వడం దారుణమని చెప్పారు. వైసీపీ కుట్ర బయట పడిందని అన్నారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడకుండా, ప్రతిపక్షాలపై బురద చల్లేందుకు దేవాలయాలపై దాడుల విషయాన్ని ముందుకు తేవడానికి వైసీపీ నేతలు యత్నించారని మండిపడ్డారు. వైసీపీ పాలనలోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని... జగన్ పాలనలోనే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఆలయాలపై 147 ఘటనలు జరిగాయని... వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.