రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం... త్వరలోనే శ్రీకారం: వైవీ సుబ్బారెడ్డి
- కృష్ణా జిల్లా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమం
- ఆలయ వర్గాలకు కపిల గోవును అందజేసిన వైవీ సుబ్బారెడ్డి
- వెంకన్నను చేరువ చేసేందుకు ఆలయాల నిర్మాణమని వెల్లడి
- కల్యాణమస్తు పునరుద్ధరిస్తున్నామని వెల్లడి
కృష్ణా జిల్లాలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన గుడికో గోమాత కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి గాయత్రీ సొసైటీ బహూకరించిన కపిల గోవును ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో 500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం అని వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. కరోనా వ్యాప్తితో ఆలయాల నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. అందరికీ వెంకన్నను చేరువ చేయడమే దీని వెనకున్న ఉద్దేశమని తెలిపారు.
కాగా, గత సర్కారు నిలిపివేసిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని తాము పునరుద్ధరిస్తున్నామని, పేద కుటుంబాలకు చెందిన జంటలకు తాళి, వివాహ దుస్తులు అందజేసి పెళ్లిళ్లు జరిపిస్తామని వైవీ చెప్పారు. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన గుడికో గోమాత కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యుడు మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.