రెండు వికెట్లు తీసిన అశ్విన్... భారీ ఆధిక్యంపై కన్నేసిన ఇంగ్లండ్

  • చెన్నైలో రసవత్తరంగా తొలి టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌటైన భారత్
  • రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 2 వికెట్లకు 45 రన్స్
  • ఇంగ్లండ్ ఆధిక్యం 286 పరుగులు
చెన్నైలో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ రోరీ బర్న్స్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ డామ్ సిబ్లీ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కే లభించాయి.

ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 2 వికెట్లకు 45 పరుగులు కాగా, ఓవరాల్ గా ఆ జట్టు ఆధిక్యం 286 పరుగులకు చేరింది. డాన్ లారెన్స్, కెప్టెన్ జో రూట్ ఆడుతున్నారు. ఇంగ్లండ్ మరో 150 పరుగులు చేసినా చాలు... టీమిండియాకు భారీ లక్ష్యం నిర్దేశించవచ్చు. రేపు ఆటకు చివరి రోజు కావడంతో ఫలితం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.


More Telugu News