శశికళ గ్యాంగ్ ను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు: పళనిస్వామి

  • పార్టీని నాశనం చేసేందుకు విష శక్తులు యత్నిస్తున్నాయి
  • జయలలిత ఆశీస్సులు మాకే ఉన్నాయి
  • శశికళ, దినకరన్ వర్గం ఆటలు సాగబోవు
దివంగత జయలలిత నెచ్చెలి శశికళ జైలు నుంచి విడుదల కావడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. జయలలిత వారసురాలిని తానేనని శశికళ ప్రకటించింది. అంతేకాదు, తన వాహనంపై ఆమె అన్నాడీఎంకే జెండాను ఉంచారు. ఈ నేపథ్యంలో శశికళను నిలువరించేందుకు అన్నాడీఎంకే నేతలు యత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి నేరుగా యాక్షన్ లోకి దిగారు. శశికళ, దినకరన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అన్నాడీఎంకేని నాశనం చేసేందుకు కొన్ని విష శక్తులు యత్నిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వారు... పార్టీని వారి నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వారు ఎన్ని గిమ్మిక్కులకు పాల్పడినా, తలకిందుల తపస్సు చేసినా పార్టీలో చేర్చుకోబోమని అన్నారు. జయలలిత ఆశీస్సులు తమకే ఉన్నాయని చెప్పారు. శశికళ, దినకరన్ వర్గం ఆటలు సాగబోవని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News