షార్ట్ సర్క్యూట్ వల్లే సీరమ్ ప్రమాదం: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
- ఎవరి ప్రమేయం లేదన్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్
- కావాలని చేసింది కాదని ప్రకటన
- గత నెల 21న ప్రమాదం.. ఐదుగురి మృతి
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టీకాల ఉత్పత్తి ప్లాంట్ లో ఆమధ్య జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటేనని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. అందులో ఎవరి పాత్రా లేదని, ఎవరూ కావాలని చేసింది కాదని చెప్పారు. శుక్రవారం దీనిపై ఆయన ప్రకటన చేశారు.
జనవరి 21న పూణెలోని నిర్మాణంలో ఉన్న సీరమ్ వ్యాక్సిన్ ప్లాంట్ నాలుగు, ఐదు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. పది మంది అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు.
దీని వల్ల కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తిపై ఎలాంటి ప్రభావం పడలేదు. అయితే, ఈ ప్రమాదం వల్ల సంస్థకు రూ.వెయ్యి కోట్ల నష్టం వచ్చినట్టు సంస్థ సీఈవో అధర్ పూనావాలా ప్రకటించారు. ఘటనపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే దర్యాప్తునకు ఆదేశించారు. స్వయంగా వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.