చిక్కబళ్లాపూర్‌లో పేలిన జిలెటిన్ స్టిక్స్.. ఆరుగురి దుర్మరణం

  • క్వారీయింగ్ కోసం తీసుకెళ్తుండగా ఘటన
  • పోలీసు దాడులకు భయపడి దాచే ప్రయత్నం
  • చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో దారుణం జరిగింది. జిలెటిన్ స్టిక్స్ పేలిన ఘటనలో ఈ ఉదయం ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. క్వారీలో ఉపయోగించేందుకు వీటిని అక్రమంగా తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసుల దాడులకు భయపడి వాటిని దాచేందుకు ప్రయత్నించగా అవి ఒక్కసారిగా పేలిపోయాయి.

ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని కర్ణాటక మంత్రి సుధాకర్ తెలిపారు. క్వారీల్లో ఉపయోగించేందుకు అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని, ఈ విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తామని మంత్రి తెలిపారు.


More Telugu News