ముఖేశ్ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు... అప్రమత్తమైన పోలీసులు

  • స్కార్పియో వాహనంలో పేలుడు పదార్థాలు
  • గుర్తించిన అంబానీ సెక్యూరిటీ సిబ్బంది
  • పోలీసులకు సమాచారం అందించిన వైనం
  • హుటాహుటీన వచ్చిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు
  • వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయన్న మహారాష్ట్ర హోంమంత్రి
భారత వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కలకలం రేగింది. ముంబయిలోని అంబానీ నివాసం యాంటిల్లాకు సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో వాహనం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ వాహనాన్ని గుర్తించిన ముఖేశ్ అంబానీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్లు వాహనాన్ని, పరిసరాలను తనిఖీ చేశాయి.

దీనిపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పందిస్తూ, ఆ వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్టు తేలిందని వెల్లడించారు. దీనిపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కాగా, ఆ వాహనాన్ని అక్కడ ఎవరు పార్క్ చేశారన్నదానిపై పోలీసులు అక్కడి సీసీ టీవీ కెమెరాల ఫుటేజిని పరిశీలించనున్నారు.


More Telugu News