విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ సీఎం లేఖ.. సమాధానం ఇమ్మంటూ ‘దీపం’కు పీఎంవో సూచన

  • స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలంటూ జగన్ లేఖ
  • ఆ లేఖపై మీ సమాధానం ఏంటంటూ సామాజిక కార్యకర్త  స.హ. చట్టం కింద దరఖాస్తు
  • స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. సీఎం రాసిన లేఖపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం  జగన్ లేఖను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) విభాగానికి పంపించింది. ఈ లేఖకు తగిన జవాబు ఇవ్వాలని సూచించింది.

అలాగే, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని బయ్యారంలో నెలకొల్ప తలపెట్టిన ఉక్కు కర్మాగారాలపై అధ్యయనం కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్ నుంచి ఇప్పటి వరకు తుది నివేదిక రాలేదని ఇనగంటి లేఖకు పీఎంవో సమాధానం ఇచ్చింది.


More Telugu News