ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలో మరో 10 రాఫెల్ యుద్ద విమానాలు

  • 36 రాఫెల్ విమానాల కోసం ఫ్రాన్స్ తో ఒప్పందం
  • రెండు, మూడ్రోజుల్లో 3 రాఫెల్ విమానాల రాక
  • వచ్చే నెలలో భారత్ చేరుకోనున్న మరో 7 విమానాలు
  • వాయుసేన సత్తాను మరింత పెంచిన రాఫెల్ విమానాలు
శత్రుభీకర యుద్ధ విమానంగా గుర్తింపు పొందిన రాఫెల్ జెట్ ఫైటర్ చేరికతో భారత్ వాయుసేన సామర్థ్యం మరింత ఇనుమడించింది. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) అమ్ములపొదిలో మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో 3 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్ రానున్నాయి. వచ్చే నెలలో 7 రాఫెల్ జెట్ ఫైటర్లు భారత్ చేరుకుంటాయి. మొత్తం 36 రాఫెల్ పోరాట విమానాల కోసం భారత్ 2016లో ఫ్రెంచ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చైనా, పాకిస్థాన్ లపై గట్టి ఆధిపత్యాన్ని అందిస్తున్నాయి. గగనతలంలో వీటి సామర్థ్యం అంతాఇంతా కాదు. శత్రుదేశాల సరిహద్దులు దాటకుండానే ప్రత్యర్థులపై దాడి చేయగలవు. రాడార్లకు చిక్కకుండా తక్కువ ఎత్తులో దూసుకెళ్లడమే కాదు, ఒకే సమయంలో భిన్న లక్ష్యాలను ఎంచుకుని దాడులు చేసే అత్యంత అధునాతన ఎలక్ట్రానిక్ వ్యవస్థలు దీంట్లో పొందుపరిచారు. స్కాల్ప్, మెటియోర్ వంటి విధ్వంసక క్షిపణులను రాఫెల్ కు జతచేయడంతో దీని సత్తా మరింత పెరిగింది.


More Telugu News