ఇటువంటి దాడులను చూస్తూ ఊరుకోబోం: బైడెన్, కమలా హ్యారిస్
- ఆసియన్ అమెరికన్లపై దాడులు సరికాదు
- వాటిని అరికట్టేందుకు న్యాయశాఖలో విభాగాన్ని ఏర్పాటు చేస్తాం
- పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నాం
ఆసియన్ అమెరికన్లపై దాడులు జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వారిపై పెరుగుతోన్న దాడులను అరికట్టేందుకు న్యాయశాఖలో విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఇటువంటి దాడులు చేయడం చాలా తప్పని ఆయన చెప్పారు. ఇటువంటి చర్యలకు ముగింపు పలకాలని అన్నారు.
అలాగే, ఈ విషయంపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా స్పందించారు. మనలో ఎవరికైనా హాని జరుగుతోందంటే అది మనందరికీ జరిగినట్లేనని ట్వీట్ చేశారు. ఇటువంటి హింస విషయంలో తాను, అధ్యక్షుడు బైడెన్ మౌనంగా ఉండబోమని చెప్పారు.
ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని కమలా హ్యారిస్ అన్నారు. కాగా, రెండు రోజుల క్రితం న్యూయార్క్‌లో ఆసియాకు చెందిన ఓ వృద్ధురాలిపై ఓ వ్యక్తి దారుణంగా దాడికి పాల్పడి ఆసియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ఈ నేపథ్యంలోనే బైడెన్, కమల హ్యారిస్ స్పందించారు.