కొత్త చిక్కుల్లో పడ్డ దర్శకుడు శంకర్.. కోర్టుకు లాగిన లైకా ప్రొడక్షన్స్!
- ఆగిన కమల్, శంకర్ ల 'భారతీయుడు 2'
- చరణ్ తో సినిమా ప్రకటించిన శంకర్
- కోర్టులో పిటిషన్ వేసిన లైకా ప్రొడక్షన్స్
- శంకర్ కు నోటీసులు ఇచ్చిన హైకోర్టు
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. మెగా హీరో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి ప్లానింగ్ జరుగుతున్న సంగతి విదితమే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ప్రాజక్టుకు పెద్ద క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగు త్వరలోనే మొదలవుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి.
సరిగ్గా ఇదే సమయంలో శంకర్ ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కోర్టుకు లాగింది. కమలహాసన్, శంకర్ కాంబోలో రెండున్నర దశాబ్దాల క్రితం వచ్చిన 'భారతీయుడు' (తమిళంలో ఇండియన్) చిత్రానికి ఆమధ్య సీక్వెల్ నిర్మాణాన్ని లైకా ప్రొడక్షన్స్ ప్రారంభించింది. చాలా షూటింగ్ కూడా జరిగింది. లాక్ డౌన్ కి కాస్త ముందు ఈ చిత్రం షూటింగులో జరిగిన అగ్ని ప్రమాదంలో కొందరు సిబ్బంది మరణించడంతో తాత్కాలికంగా షూటింగ్ ఆగింది. ఆ తర్వాత దర్శకుడికి, నిర్మాతలకు మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సినిమా హఠాత్తుగా ఆగిపోయింది.
ఇది జరిగిన కొన్నాళ్లకు రామ్ చరణ్ తో సినిమా చేయాలని శంకర్ నిర్ణయించుకోవడం జరిగింది. సరిగ్గా ఈ న్యూస్ మీడియాలో పెద్ద ఎత్తున రావడంతో లైకా ప్రొడక్షన్స్ రంగంలోకి దిగింది. తమ చిత్రాన్ని పూర్తిచేయకుండా మరే చిత్రాన్ని చేయడానికి వీల్లేదంటూ దర్శకుడిని నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మద్రాస్ హైకోర్టులో సదరు చిత్ర నిర్మాణ సంస్థ పిటిషన్ వేసింది.
236 కోట్ల ప్రాథమిక బడ్జెట్టుతో తమ చిత్ర నిర్మాణం ప్రారంభించామని, ఇప్పటికే 180 కోట్లు ఖర్చు పెట్టామని పిటిషన్ లో పేర్కొన్నారు. దర్శకుడికి పారితోషికంగా 40 కోట్లు మాట్లాడుకుని, ఇప్పటికే 14 కోట్లు ఇచ్చామనీ, మిగతా మొత్తం కోర్టులో జమచేయడానికి సిద్ధంగా ఉన్నామనీ నిర్మాతలు తెలిపారు.
అయితే, ఈ కేసులో దర్శకుడు శంకర్ ను 'భారతీయుడు 2' పూర్తవకుండా, మరో చిత్రం చేబట్టకుండా నిలుపుదల చేయడానికి కోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో ఆయన వెర్షన్ ను వినిపించమంటూ దర్శకుడికి నోటీసులు మాత్రం జారీ చేసింది. ఏమైనా, ఈ కొత్త ఇబ్బందులతో శంకర్ చేయాల్సిన చరణ్ సినిమా ఆలస్యమయ్యే అవకాశం వుండచ్చేమోనని వార్తలొస్తున్నాయి.