ఒక పార్టీ జెండా పీకేసే ముందు జరిగే పరిణామాలు ఇవి!: విజ‌య‌సాయిరెడ్డి

  • వరస ఓటములతో నాయకత్వంపై క్యాడర్ కు నమ్మకం పోతుంది
  • పోటీకి అభ్యర్థులు దొరకరు
  • సాకులు చూపి ఎలక్షన్లకు దూరంగా ఉంటామని ప్రకటిస్తుంది
  • ఖేల్ ఖతం.. దుకాణం బంద్  
తెలుగు దేశం పార్టీపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై విజ‌య‌సాయిరెడ్డి స్పందిస్తూ.. 'చంద్రబాబు ఎన్నికల్ని బహిష్కరించాడా?...లేదా ఏపీ ప్రజలే చంద్రబాబును బహిష్కరించారా? లోకల్ బాడీలు చంద్రబాబును భయపెడుతున్నాయా....లేక లోకేశ్‌ బాడీ లాంగ్వేజ్ చంద్రబాబును భయపెడుతోందా?!' అని ఎద్దేవా చేశారు.

'ఒక పార్టీ జెండా పీకేసే ముందు జరిగే పరిణామాలు. వరస ఓటములతో నాయకత్వంపై క్యాడర్ కు నమ్మకం పోతుంది. శ్రేణులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటాయి. పోటీకి అభ్యర్థులు దొరకరు. ఏవో సాకులు చూపి ఎలక్షన్లకు దూరంగా ఉంటామని నాయకత్వం ప్రకటిస్తుంది. ఖేల్ ఖతం.. దుకాణం బంద్' అని ఆయ‌న ట్వీట్ చేశారు.


More Telugu News