తెలంగాణలో లాక్‌డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులు ప్రచారం చేసిన యువకుడి అరెస్టు
- ఇటీవల సామాజిక మాధ్యమాల్లో నకిలీ జీవో వైరల్
- నిందితుడు శ్రీపతి సంజీవ్ నకిలీ జీవోను సృష్టించాడన్న పోలీసులు
- ఓ ల్యాప్‌టాప్, మొబైల్ స్వాధీనం
- పాత జీవోలో మార్పులు చేసి కొత్తదిగా రూపొందించాడని వెల్లడి
కరోనా మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో తెలంగాణలో రాత్రి వేళల్లో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అచ్చం ప్రభుత్వం ప్రకటన చేసిన మాదిరిగా నకిలీ ఉత్తర్వులను రూపొందించి వైరల్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం శ్రీపతి సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఈ నకిలీ జీవోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యేలా చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు.
నిందితుడి నుంచి ఓ ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అతడి స్వస్థలం నెల్లూరు అని, ఓ ప్రైవేటు సంస్థలో ఛార్టెడ్ అకౌంటెంట్‌గా ఇక్కడ పని చేస్తున్నాడని తెలిపారు. తెలంగాణలో గత ఏడాది లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఇచ్చిన జీవోను డౌన్‌లోడ్ చేసుకున్న శ్రీపతి అందులో మార్పులు చేసి కొత్త జీవోగా దాన్ని సృష్టించారని అంజనీ కుమార్ చెప్పారు.
అనంతరం ఆ నకిలీ జీవోను సంజీవ్ తో పాటు అతడి స్నేహితులు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారని తెలిపారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను ఎవ్వరూ షేర్ చేయొద్దని, నిజాన్ని నిర్ధారించుకోకుండా షేర్ చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పారు.