నలుగురు ప్రధాన అర్చకులను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు
- వంశపారం పర్య అర్చకులలోని నాలుగు కుటుంబాలకే చాన్స్
- గొల్లపల్లి కుటుంబం నుంచి గోపినాథ్ దీక్షితులు
- తిరుపతమ్మ నుంచి నారాయణ దీక్షితులు
- పైడపల్లి నుంచి రాజేశ్, పెద్దింటి నుంచి రవిచంద్ర దీక్షితులు
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులను నియమిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు ప్రధాన అర్చకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వంశపారం పర్య అర్చకులలోని నాలుగు కుటుంబాలకే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వివరించింది.
గొల్లపల్లి కుటుంబం నుంచి గోపినాథ్ దీక్షితులను, తిరుపతమ్మ నుంచి నారాయణ దీక్షితులను, పైడపల్లి నుంచి రాజేశ్ దీక్షితులను, అలాగే, పెద్దింటి నుంచి రవిచంద్ర దీక్షితులను నియమిస్తున్నట్లు పేర్కొంది. కైంకర్యపర అర్చకులకు ఈ అవకాశం లేదని వివరించింది.