జగన్ వల్లే ప్రత్యేక హోదా అంశం ఇప్పటికీ సజీవంగా ఉంది: ఏపీ మంత్రి బాలినేని
- వైసీపీ అభ్యర్థికి మద్దతుగా తిరుపతిలో ప్రచారం
- సీఎంపై ప్రశంసల జల్లు
- పార్లమెంటులో స్వరం వినిపించేందుకు గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి
- ప్రతిపక్షాలపై విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ఇప్పటికీ సజీవంగా ఉందంటే అది కేవలం ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వల్లేనని ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ఇంధన, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జగన్ అత్యంత సమర్థత గల నాయకుడని.. ఆయన సారథ్యంలో అనునిత్యం ప్రజలకు సేవ చేసేందుకు పార్టీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో వారందరి స్వరం పార్లమెంటులో ప్రతిధ్వనించాలంటే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
ప్రజలను వంచించేందుకు తోడేళ్ళలా కాచుక్కూర్చున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై బాలినేని విరుచుకుపడ్డారు. అలాంటి పార్టీలకు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ, తెదేపా అభ్యర్థులను గెలిపించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దలు దిగివచ్చేలా ఇక్కడి ఓటర్లు తీర్పు చెప్పాలన్నారు.