భార‌త్‌లో క‌రోనా ఉద్ధృతిపై పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ స్పంద‌న‌!

  • భార‌త ప్ర‌జ‌ల‌కు నా సంఘీభావం తెలుపుతున్నాను
  • కరోనాతో బాధ‌ప‌డుతున్న వారంతా త్వ‌ర‌గా కోలుకోవాలి
  • క‌రోనాపై అంద‌రం క‌లిసి పోరాడాలి
భార‌త్‌లో క‌రోనా తీవ్ర‌తపై ప్ర‌పంచ దేశాల ప్ర‌ముఖులు స్పందిస్తూ భార‌త ప్ర‌జ‌లకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కూడా దీనిపై స్పందించారు. 'భ‌యంక‌రమైన కొవిడ్-19తో పోరాడుతున్న భార‌త ప్ర‌జ‌ల‌కు నా సంఘీభావం తెలుపుతున్నాను. కరోనాతో బాధ‌ప‌డుతున్న‌ భార‌త్‌తో పాటు ప్ర‌పంచ దేశాల‌ ప్ర‌జ‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నాము. ప్ర‌పంచానికి స‌వాలు విసురుతోన్న క‌రోనాపై అంద‌రం క‌లిసి పోరాడాలి' అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు.

భార‌త్‌పై ఎప్పుడూ మండిప‌డుతూ వ్యాఖ్య‌లు చేసే  పాకిస్థాన్ స‌మాచార శాఖ మంత్రి ఫ‌వాద్ హుస్సేన్ కూడా తాజాగా భార‌త్‌లో క‌రోనా ప‌రిస్థితుల‌పై స్పందిస్తూ క‌రోనా నుంచి బ‌య‌టప‌డాల‌ని కోరుకున్నారు. 'ఈ క్లిష్ట స‌మ‌యంలో భార‌త ప్ర‌జ‌ల కోసం ప్రార్థిస్తున్నాము. వారిపై దేవుడు ద‌య‌చూపాల‌ని కోరుకుంటున్నాము. ఈ క్లిష్ట ప‌రిస్థితుల నుంచి భార‌త్ త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నా'న‌ని చెప్పారు.


More Telugu News