కరోనాపై విజయం సాధించినందుకు అతి పెద్ద వేడుక చేసుకున్న న్యూజిలాండ్.. వీడియో ఇదిగో
- గత రాత్రి 50 వేల మందితో వేడుక
- ఈడెన్ పార్క్ స్టేడియానికి వచ్చిన ప్రజలు
- తాము సాధారణ జీవితాన్ని గడపగలమన్న ఆక్లాండ్ మేయర్ ఫిల్ గోఫ్
తమ దేశంలో కరోనాను జయించిన నేపథ్యంలో న్యూజిలాండ్ వేడుక చేసుకుంది. గత రాత్రి 50 వేల మందితో న్యూజిలాండ్‌లోని అతిపెద్ద ఈడెన్ పార్క్ స్టేడియం (ఆక్లాండ్)లో లైవ్ మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించగా అందరూ ఆడుతూపాడుతూ ఎంజాయ్ చేశారు. కరోనాను జయించడంతో తాము ఇక భౌతిక దూరం, మాస్కులు పెట్టుకోవడం వంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదని న్యూజిలాండ్ ప్రజలు ఎగిరిగంతులేశారు.
ప్రపంచం మొత్తం కరోనా వ్యాప్తిస్తోన్న వేళ తాము ఎప్పటిలాగే సాధారణ జీవితాన్ని గడపగలమని నిరూపించుకున్నామని ఆక్లాండ్ మేయర్ ఫిల్ గోఫ్ అన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ బ్యాండ్ సిక్స్60 ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది. కరోనా వ్యాప్తి అనంతరం ఇంత మంది జనంతో అక్కడ భారీ వేడుక నిర్వహించడం ఇదే తొలిసారి.